Horoscope Today: మేషం (Aries): చేపట్టిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అనుకూల ఫలితాలను సాధిస్తారు. క్లిష్టమైన సమస్యలను మీ తెలివితేటలతో పరిష్కరిస్తారు. గురువుల దీవెనలు మీకు శుభం కలిగిస్తాయి.
వృషభం (Taurus): కీలక వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీ పని తీరుతో అందరి ప్రశంసలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించడం శ్రేయస్కరం.
మిథునం (Gemini): పనుల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రుల అండదండలు మీకు లభిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం (Cancer): శారీరక శ్రమ పెరగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మీయులతో విబేధాలు రాకుండా చూసుకోండి. శ్రీరామనామ స్మరణ శుభప్రదం.
సింహం (Leo): ఉన్నతమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను సాధిస్తారు. ఏనాటి పనులు ఆనాడే పూర్తి చేసేలా ముందుకు సాగండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, సమయానికి నిద్రాహారాలు తీసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం పఠించడం మంచిది.
కన్య (Virgo): చేపట్టిన పనులలో ఆటంకాలు వచ్చినా, దైవబలంతో వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. క్రమంగా అభివృద్ధి పథంలో సాగుతారు. వేంకటేశ్వర స్వామి దర్శనం మీకు శుభకరం.
తుల (Libra): సమయం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మీ మీ రంగాల్లో చురుకుగా సాగి విజయాన్ని అందుకుంటారు. ఇతరులకు మేలు చేసే పనులు చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించడం ఉత్తమం.
వృశ్చికం (Scorpio): ప్రస్తుత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ పని మొదలుపెట్టిన వెంటనే పూర్తి చేస్తారు. మీ సంకల్పం నెరవేరుతుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. దైవారాధన మానకండి.
ధనుస్సు (Sagittarius): రోజువారీ పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మనశ్శాంతితో గడుపుతారు. ఆత్మీయులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఆదిత్య హృదయం పఠించడం మేలు చేస్తుంది.
మకరం (Capricorn): ఉద్యోగంలో స్థిరమైన నిర్ణయాలతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వ్యాపార లావాదేవీల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం. సకాలంలో సహాయం చేసేవారు మీకు అందుబాటులో ఉంటారు. శివారాధన చేయడం శ్రేయస్కరం.
కుంభం (Aquarius): పనుల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా మీ మనోధైర్యంతో వాటిని పూర్తి చేయగలుగుతారు. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.
మీనం (Pisces): కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పని ఒత్తిడి పెరగకుండా ముందుజాగ్రత్త అవసరం. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం ఉంటుంది. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.
