Horoscope Today: మేషం: ఈ రోజు మీకు ఆపద్బాంధవుడిలా ఎవరో ఒకరు అండగా నిలుస్తారు. మిత్రులతో అనవసర వాదనలకు పోకుండా సామరస్యంగా ఉండటం మంచిది. అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు మీ కెరీర్‌కు మేలు చేస్తాయి. అనవసర ఖర్చుల విషయంలో పట్టు వదలకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, తగినంత విశ్రాంతి తీసుకోండి.
-
పరిహారం: ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి.
వృషభం: మీ మనసుకి నచ్చే శుభవార్తలు వింటారు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చేపట్టిన పనుల్లో ఇతరుల సహకారం లభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. సామాజికంగా మీకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ధర్మబద్ధమైన ఆలోచనలే మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి.
-
పరిహారం: దుర్గాష్టకాన్ని పఠించడం వల్ల శుభం కలుగుతుంది.
మిథునం: ముందుచూపుతో చేసే ఆలోచనలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కుటుంబ పెద్దల మాటను జవదాటకండి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మానసిక ప్రశాంతత కోసం దైవ ధ్యానం చేయండి.
-
పరిహారం: ఇష్టదైవానికి దీపారాధన చేయండి.
కర్కాటకం: మీలో మనోబలం పెరుగుతుంది. దీనివల్ల కఠినమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ ప్రతిభకు తగిన ప్రశంసలు దక్కుతాయి. సన్నిహితుల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
-
పరిహారం: విష్ణు సహస్రనామ పఠనం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి.
సింహం: అందరినీ కలుపుకుని పోవడం వల్ల ఈ రోజు మీకు మేలు జరుగుతుంది. ఆత్మీయులు ఇచ్చే సూచనలు మీ సమస్యలను పరిష్కరిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవాన్ని వదులుకోవద్దు. వివాదస్పద విషయాలకు దూరంగా ఉండటం మీ శ్రేయస్కరం.
-
పరిహారం: ఆంజనేయస్వామి దర్శనం మరియు శని స్తోత్ర పఠనం శాంతినిస్తాయి.
కన్య: ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా మీకు లాభదాయకమైన రోజు. మీ సమయస్ఫూర్తి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కిస్తుంది. వృత్తిలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు కలిసివస్తాయి.
-
పరిహారం: సంకట నాశన గణపతి స్తోత్రం చదువుకోండి.
తుల: మీ పట్టుదలే మీకు ఈ రోజు శ్రీరామరక్ష. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. గృహ సంబంధిత సమస్యలను సహనంతో పరిష్కరించుకోండి. ఆవేశం తగ్గించుకోవడం మంచిది.
-
పరిహారం: దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల జ్ఞానం, శాంతి లభిస్తాయి.
వృశ్చికం: ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టువదలక ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధువులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగి అనుబంధం బలపడుతుంది. మాట తీరులో మార్పు అవసరం.
-
పరిహారం: అష్టలక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
ధనుస్సు: ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్ల సూచనలు ఉన్నాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంతానానికి సంబంధించి మంచి వార్తలు వింటారు. పనులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
-
పరిహారం: గణేశుడికి గరికతో పూజ చేయడం శుభకరం.
మకరం: అన్ని విధాలా మీకు అనుకూలమైన కాలం నడుస్తోంది. సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఆశించిన మేర లాభాలు ఉంటాయి. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు.
-
పరిహారం: గణపతి ఆరాధనతో పనులు నిర్విఘ్నంగా సాగుతాయి.
కుంభం: కొత్తగా ప్రారంభించిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల సహాయంతో కీలకమైన అడుగులు వేస్తారు. మీ ఐడియాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
-
పరిహారం: కులదైవాన్ని స్మరించుకోవడం వల్ల ధైర్యం లభిస్తుంది.
మీనం: పెద్దల ఆశీస్సులు మీకు అండగా ఉంటాయి. ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అనవసర చర్చలకు తావు ఇవ్వకండి. మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి.
-
పరిహారం: హనుమాన్ చాలీసా పఠనం సర్వ భయాలను తొలగిస్తుంది.
