Kidney Racket

Kidney Racket: కిడ్నీ రాకెట్ ముఠా కు సంబంధించి గుట్టురట్టు

Kidney Racket: సంతలో కూరగాయలు అనుకున్నారా రా..అవి. దెబ్బకు అలా ఎలా మార్చేస్తున్నారు. డబ్బుల కోసం మరి ఇంతలా దిగజారితే ఎలా ఓ డాక్టర్ సాబ్. సారీ సాబ్ కాదు …పైసల కోసం కక్కుర్తి పడే …తెల్ల కోటు వేసుకున్న ..డబ్బుగాళ్ళు. కొందరు వైద్యులు వైద్యాన్ని ఫ్రీ గా అందిస్తుంటే …మరి కొందరు డబ్బులే మెయిన్ టార్గెట్ గా వైద్యం అనే ముసుగుతో దోచుకుంటున్నారు

కిడ్నీ రాకెట్ దందాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రి సాధారణ ఆసుపత్రి
తెరవెనుక కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది గతంలోనూ ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు ఒక్కో కిడ్నీకి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం

హైదరాబాద్ నగరంలో కిడ్నీ రాకెట్ ముఠాకు సంబంధించిన గుట్టు రట్టైంది. బయటకు సాధారణ ఆసుపత్రిలా ఉంటుంది. లోపల మాత్రం కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఎల్బీ నగర్ ఏసీపీతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కొన్ని రోజులుగా అలకనంద ఆసుపత్రికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

Kidney Racket: సాధారణ ఆసుపత్రి పేరుతో వీరు కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లుగా అధికారుల తనిఖీల్లో బయటపడింది. గతంలో ఇలానే కిడ్నీ మార్పిడి చేస్తున్న సమయంలో ఓ మహిళ చనిపోయింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆ ఘటనను తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. సుమారుగా వందలాది మందికి ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయకులకు ఎర వేసి, వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లు తేలింది. సుమన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తనిఖీల తర్వాత ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు.

కిడ్నీ రాకెట్ దందాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయ్యింది. దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టింది. సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రి సాధారణ ఆసుపత్రి. ఈ హాస్పిటల్ లో 9 బెడ్స్ ఉన్నాయి. ఈ మేరకు పర్మిషన్ తీసుకున్నారు. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండా 30 పడకలకు విస్తరించారు. తెరవెనుక కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది.

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

గతంలోనూ ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చికిత్సకు వచ్చిన వారిలో కొందరు చనిపోయినట్లు తెలుస్తోంది. వరుస ఆరోపణలు రావడంతో స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడికి సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా తనిఖీల్లో వెలుగుచూసింది. 6 నెలల నుంచి కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో కిడ్నీకి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *