Congress: మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి తరఫున తెలంగాణ ముఖ్య నేత కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడిగా ఆయన వివిధ అసెంబ్లీ స్థానాల్లో గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆ పార్టీ కూటమి అభ్యర్థులను గట్టెక్కించే పనిలో ఉన్నారు.
Congress: తాజాగా నాందేడ్ మరఠ్వాడా ప్రాంతంలో నిర్వహించిన ప్రచార సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా కీలక నేతగా పాల్గొన్నారు. దీన్నిబట్టి రాష్ట్ర నేతల్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి సీతక్క కూడా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్నా, ఉత్తమ్‌కే ఆ పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలను అప్పగించింది.