Cyber scam: ట్రేడింగ్ మోసం..69 లక్షలు మాయం

Cyber Scam: దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.జనాలని ఎట్లా మోసం చేయాలని రోజుకో కొత్తదారి వెతుక్కుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. మనుషులని ఎలా బుట్టలో వేసుకోవాలి వారి నుంచి డబ్బులు ఎలా లాగానే దానిమీద పీహెచ్డీలు చేస్తున్నారు. రోజుకో విధంగా ఘరానా మోసం చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. మీరు బారిన పడకుండా ఉండకు ప్రభుత్వాలు పోలీసులు ప్రజలకు ఎంత చెప్పినా గాని ఏదో ఒక విధంగా ఈ మాయగాల్ల మూటలో పడిపోతున్నారు. సైబర్‌ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు.

వాట్సాప్ లింక్ పంపించి డబ్బులు కొట్టేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.  మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మెట్ పల్లి టౌన్ కు చెందిన ఓ డాక్టర్ స్టాక్ మార్కెట్ లో ఇన్ వెస్ట్ మెంట్ చేసేందుకు కొద్ది నెలల కింద ఆన్ లైన్ లో ఏసీ మాక్స్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేశాడు. వెంటనే అక్సెల్ స్టూడెంట్–95 అనే వాట్సాప్ గ్రూప్ లో లింక్ మెసేజ్ వచ్చింది. దీంతో ట్రేడింగ్ లో ఇన్ వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. వెంటనే డాక్టర్  రూ.69 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

తిరిగి తీసుకుందామని ప్రయత్నిస్తే లింక్ ఓపెన్ కాలేదు. మోసపోయాయని తెలుసుకుని గత మే నెలలో సైబర్ క్రైమ్ సెల్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. డాక్టర్ డబ్బులు కొట్టేసిన నిందితులు బ్యాంక్ ఖాతాలను గుర్తించి విచారణ చేపట్టారు. పంజాబ్ లోని అమృతసర్, జలంధర్ కు చెందిన నిందితులుగా గుర్తించారు. జలంధర్ కోర్టులో హాజర పరిచి ట్రాన్సిట్ వారంట్ పై మెట్ పల్లికి తీసుకొచ్చారు.గురువారం మెట్ పల్లి కోర్టులో రిమాండ్ చేశారు. బాధిత డాక్టర్ కు రూ. 10 లక్షలు అప్పగించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tummala nageshwar rao: పాలమూరులో మూడు రోజులు రైతు సదస్సు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *