AP News: సామాజిక పింఛన్ లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు నెలనెలా తీసుకోలేని వారు మూడు నెలలకు ఒకేసారి పింఛన్ సొమ్మును తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు. పింఛన్‌ను ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని లబ్ధిదారులకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పింఛన్ తీసుకోవడం లబ్ధిదారుల హక్కు అని, పింఛన్ సొమ్మును ఇంటి వద్దే గౌరవంగా ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Auto Tips: ట్రాఫిక్‌లో ఇంజిన్ ఆన్‌లో ఉంచుతున్నారా?.. అయితే మీ పెట్రోల్..!
AP News: 64 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ అందిస్తున్నదని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే పింఛన్ సొమ్మును పెంచిన ప్రభుత్వం వారి మోములో ఆనందాన్ని నింపింది. కొద్దికాలంలో మరో శుభవార్తను అందించి ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది.