Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇటీవల హుజూరాబాద్ పట్టణంలో దళిత బంధు రెండో విడుత నిధులు విడుదల చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాస్తారోకోకు దిగారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళితులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలకు కౌశిక్‌రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Kaushik Reddy: ఆ రోజు జరిగిన ధర్నా, రాస్తారోకోను పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, కార్యకర్తల నడుమ తోపులాట చోటుచేసుకొని కౌశిక్‌రెడ్డికి గాయాలయ్యాయి. అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆయనను అక్కడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Kaushik Reddy: ఆనాటి ఘటనపై తాజాగా పోలీసులు సెక్షన్ 35 (3) బీఎన్ఎస్ యాక్టు ప్రకారం కౌశిక్‌రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యే సహా ఇతరులకు ఆదివారం నోటీసులు అందజేశారు.