Kannappa: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పకు సంబంధించి డార్లింగ్ హీరో ప్రభాస్ ఫొటో లీకైంది. ఇంకేముంది.. ఆ ఫోటో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్రబృందం ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేసింది. ఆ ఫొటోను లీక్ చేసిన వారిని కనిపెడితే డబ్బులు బహుమానంగా ఇస్తామని వెల్లడించింది. కన్నప్ప సినిమాను తాము ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్నామని, రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపింది. ‘కన్నప్ప’ నుంచి ఒక్క ఫొటో అనధికారికంగా లీక్ అయినందుకు బాధపడుతున్నామని తెలిపింది. ఈ ఫొటో బయటకు ఎలా వెళ్లిందనే విషయంపై తాము పోలీస్ కేసు పెట్టామని చెప్పింది. ఈ ఫొటోను ఎవరూ షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. దీన్ని షేర్ చేసిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఫొటోను లీక్ చేసిన వ్యక్తిని కనిపెట్టినవారికి రూ.5 లక్షలు బహుమానం అందిస్తామని ప్రకటించింది.
Kannappa: మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా చిత్రమే కన్నప్ప. దీనిని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్ కథానాయిక. ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్లాల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీని షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇందులో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్.. నంది పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, విజువల్ గా ఆకట్టుకున్నా.. ఏదో మిస్ అయ్యిందంటూ విపరీతంగా ట్రోల్స్ చేశారు.