Kajal: ఇప్పటికే పలు హిందీ చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ మధ్య వచ్చిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’లో పోలీస్ అధికారి పాత్ర చేసింది కాజల్. ఆ మూవీ కమర్షియల్ గా విజయం సాధించకపోయినా… కాజల్ నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం తెలుగులో ‘కన్నప్ప’లో అతిథి పాత్రను చేస్తున్న కాజల్ ‘ఇండియన్ -2’లో నటించింది. అది ఈ యేడాది జనం ముందుకు రావాల్సి ఉంది. అలానే మూడు హిందీ చిత్రాలనూ కాజల్ చేస్తోంది. అందులో ఒకటి ‘ఉమ’ కాగా, మరొకటి సల్మాన్ ఖాన్ ‘సికిందర్’. ఈ రెండింటితో పాటు ‘ది ఇండియా స్టోరీ’ మూవీకీ కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను చేతన్ డీకే డైరెక్ట్ చేస్తున్నాడు. గురువారం నాడు ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. క్రిమి సంహారక మందుల కంపెనీలోని అవకతవకలపై ఈ సినిమా ఉండబోతోంది. దీనిని ఆగస్ట్ 15న విడుదల చేస్తామని నిర్మాత సాగర్ బి షిండే చెబుతున్నాడు. మరి ఈ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ కాజల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.