Bapu: వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా ‘బాపు’. ఆమని, ‘బలగం’ సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను దయా డైరెక్ట్ చేస్తున్నారు. రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఆ మధ్య ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు ‘బాపు’ మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు. ఈ సినిమా కోసం ధృవన్ స్వరపర్చగా, రఘురాం రాసిన పాటను రామ్ మిర్యాల పాడారు. ‘అల్లో నేరేడల్లో పిల్లా’ అంటూ సాగే ఈ పాటను యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఆవిష్కరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఓ వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన కథను దర్శకుడు తెర మీద చూపించారు. ఓ కుటుంబ సభ్యుడు ఇతరుల మనుగడ కోసం తన జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చినప్పుడు ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా మారతాయో డార్క్ కామెడీ, హ్యుమర్, ఎమోషన్స్ తో ఉండబోతోందీ సినిమా.