Jawahar Navodaya:

Jawahar Navodaya: కోదాడ‌లోనే న‌వోద‌య విద్యాల‌యం

Jawahar Navodaya: తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన‌ జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో ఒకటి సూర్యాపేట జిల్లాకు మంజూరైంది. ఈ మేర‌కు భ‌వ‌న నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు కూడా మంజూర‌య్యాయి. దానిని సూర్యాపేట జిల్లా కోదాడ ప‌ట్ట‌ణానికి కేటాయించారు. ఇప్ప‌టికే ఆ భ‌వ‌న నిర్మాణానికి 19.12 ఎక‌రాలను కేటాయించిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. దీంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అంద‌నున్న‌ది.

Jawahar Navodaya: కోదాడ ప‌ట్ట‌ణంలోని కేఆర్ఆర్ కళాశాల స‌మీపంలోని 19.12 ఎక‌రాల ప్ర‌భుత్వ స్థ‌లాన్ని కేటాయించిన‌ట్టు రాష్ట్ర నీటిపారుద‌ల, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి వెల్ల‌డించారు. సీబీఎస్ఈ ద్వారా ఈ న‌వోద‌య విద్యాల‌యంలో విద్యార్థుల‌కు బోధ‌న అంద‌నున్న‌ది. ఈ విద్యాల‌యం మంజూరు కావ‌డంపై జిల్లావాసులు, ముఖ్యంగా స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Jawahar Navodaya: నిరుడే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ఏడు కొత్త జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల‌ను మంజూరు చేసింది. ఈ కొత్త విద్యాల‌యాలు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, సూర్యాపేట‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి, జ‌గిత్యాల జిల్లాల‌కు మంజూర‌య్యాయి. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించింది. 2025లో అధికారిక ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *