Jailer 2: ‘డాకూ మహారాజ్’తో మరో హిట్ కొట్టాడు బాలకృష్ణ. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతకి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాను తమిళంలో 17వ తేదీన విడుదల చేశారు. కోలీవుడ్ లోనూ బాలయ్యకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఈ సినిమా రిలీజ్ సందర్భంగా టీమ్ అందరికీ విషెస్ తెలియచేస్తూ బాలయ్యకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకాంత్ తో ‘జైలర్’ సినిమా తీసి హిట్ కొట్టాడు నెల్సన్. ఇప్పుడు ‘జైలర్2’ ని రూపొందిస్తున్నాడు. నెల్సన్ ట్వీట్ వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. ‘జైలర్’లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. ‘జైలర్ 2’లోనూ కొందరు స్టార్ హీరోలు కనిపిస్తారని వినిపిస్తోంది. నెల్సన్ బాలయ్యకు ఆల్ ది బెస్ట్ చెప్పటం వెనుక ‘జైలర్2’లోకి ‘నువు కావాలయ్య’ అని చెప్పినట్లుందంటున్నారు. అదే జరిగితే ‘జైలర్2’పై అంచనాలు మామూలుగా ఉండవు. మరి రజనీ, బాలయ్య కలయిక ఖాయమా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.