IPL 2026

IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ శతకం.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి అరుదైన రికార్డు!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ లో బ్యాటర్లు మామూలు ఊపులో లేరు ఈ సీజన్‌లో పరుగుల వరద పారడమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా సెంచరీల పరంపర కొనసాగుతోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సాధించిన అద్భుత శతకంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి నమోదైంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ జరగని విధంగా, ఈ ఏడాది టోర్నీలో పాల్గొన్న మొత్తం 10 జట్ల తరఫున కనీసం ఒక సెంచరీ నమోదై సరికొత్త రికార్డు సృష్టించబడింది.

కోహ్లీ సెంచరీతో పూర్తయిన రికార్డు

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో విరాట్ కోహ్లీ తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. ఇది కోహ్లీకి ఐపీఎల్ కెరీర్‌లో 9వ సెంచరీ. ఈ ఇన్నింగ్స్ బెంగళూరుకు విజయాన్ని అందించడమే కాకుండా, టోర్నీలోని 10వ జట్టుగా ఆర్సీబీని సెంచరీల క్లబ్‌లో చేర్చింది. దీంతో ఐపీఎల్ 2026 సీజన్, అన్ని ఫ్రాంచైజీల నుంచి సెంచరీలు నమోదైన తొలి సీజన్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.

ఏ జట్టు నుంచి ఎవరు మెరిశారంటే?

ఈ సీజన్ ఆరంభం నుంచే బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఆయా జట్ల తరఫున సెంచరీలు చేసిన ప్లేయర్స్ వీళ్లే..

  • చెన్నై సూపర్ కింగ్స్: ఈ సీజన్‌లో సెంచరీల ఖాతాను సంజూ శామ్సన్ ప్రారంభించాడు. ఇప్పటివరకు అతను రెండు శతకాలు సాధించి జోరు మీదున్నాడు.

  • ముంబై ఇండియన్స్: ఈ జట్టు నుంచి ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు శతకాలతో విరుచుకుపడ్డారు. క్వింటన్ డికాక్, తిలక్ వర్మ ఇంకా ర్యాన్ రికెల్టన్ ఈ ఘనత సాధించారు.

  • సన్‌రైజర్స్ హైదరాబాద్: యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో సెంచరీ నమోదు చేశాడు.

  • రాజస్థాన్ రాయల్స్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో (15 ఏళ్లు) సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఇతడు కేవలం 36 బంతుల్లోనే వంద పరుగులు చేయడం విశేషం.

  • గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్ తన క్లాస్ ఆటతీరుతో శతకాన్ని అందుకున్నాడు.

  • ఢిల్లీ క్యాపిటల్స్: కె.ఎల్. రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు.

  • లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్ ఈ సీజన్‌లో తన సత్తా చాటుతూ సెంచరీ బాదాడు.

  • పంజాబ్ కింగ్స్: కూపర్ కానలీ జట్టును ఆదుకుంటూ అద్భుత శతకాన్ని నమోదు చేశాడు.

బ్యాటర్ల ఆధిపత్యం.. బౌలర్లకు సవాల్

ఈ సీజన్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు, 200లకు పైగా స్కోర్లు సర్వసాధారణం అయిపోయాయి. భారీ లక్ష్యాలను కూడా జట్లు సునాయాసంగా ఛేజ్ చేస్తున్నాయి. ఒకే సీజన్‌లో 10 జట్ల నుంచి సెంచరీలు రావడం అనేది బ్యాటింగ్ ప్రమాణాలు ఏ స్థాయికి చేరాయో నిరూపిస్తోంది. ముఖ్యంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చేసిన విన్యాసం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *