IPL 2025: రాబోయే మూడేండ్లకు గాను ఐపీఎల్ షెడ్యూల్ ను బిసిసిఐ ప్రకటించింది. ముందుగా ఐపీఎల్ 2025 ను మార్చి 14 నుంచి మే 25 వరకు నిర్వహించనున్నట్లు జట్టు ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది. అలాగే 2026, 2027 సీజన్‌లలో కూడా ఇదే తరహా షెడ్యూల్ అనుసరించనున్నట్లు ఫ్రాంచైజీలకు తెలిపింది. రేపు వచ్చే ఆదివారం సౌదీ అరేబియాలో జెడ్డా వేదికగా ఆటగాళ్ల మెగా వేలం ప్రారంభం నేపథ్యంలో ఫ్రాంచైజీల ముందస్తు ప్రణాళికల కోసం ఈ వివరాలు అందించినట్లు బిసిసిఐ వెల్లడించింది.
IPL 2025: జెడ్డా వేదికగా మెగా వేలం ఆదివారం జరగనుండగా వచ్చే ఏడాది ఐపీఎల్ 2025 షెడ్యూల్ ను బిసిసిఐ ఖరారు చేసింది. మార్చి 14 నుంచి మే 25 వరకు 2025 ఐపీఎల్ నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారం అందించింది. 2026, 2027 సీజన్‌లలో కూడా ఇదే షెడ్యూల్ అనుసరించనున్నట్లు ఫ్రాంచైజీలకు స్పష్టం చేసింది. ఆదివారం జెడ్డా వేదికగా ప్రారంభంకానున్న ఆటగాళ్ల మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీల ముందస్తు ప్రణాళికలు, ఆటగాళ్లన ఎంచుకునేందుకు ఉపయోగపడేలా షెడ్యూల్ వివరాలు పంచుకున్నట్లు బిసిసిఐతెలిపింది.
IPL 2025: ఫ్రాంచైజీలకు బోర్డు అందించిన సమాచారం ప్రకారం మార్చి 15- మే 31 వరకు 2026 సీజన్.. మార్చి 14- మే 30 వరకు 2027 సీజన్‌ను నిర్వహించనుంది. రాబోయే మూడు సీజన్‌ల ఫైనల్స్ ఆదివారమే జరగనున్నాయి. ఐపీఎల్ వేలం జాబితాలో మార్పులనూ ప్రకటించింది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, భారత్‌లో జన్మించి అమెరికాకు వలస వెళ్లి యూఎస్ జట్టు తరఫున ఆడుతున్న పేస్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్, ముంబై వికెట్ కీపర్ హార్దిక్ తామోర్‌లను వేలం జాబితాలో చేర్చింది.