indian voters: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా గుర్తింపు పొందిన మనదేశం మరో ఘనతను సొంతం చేసుకున్నది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారతదేశం.. అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా రికార్డు నమోదు చేసుకోనున్నది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల వివరాలతో ఈ విషయం తేటతెల్లమైంది.
indian voters:మనదేశంలో ఓటర్ల సంఖ్య తాజా లెక్కల ప్రకారం.. 99.1 కోట్లకు చేరుకోనున్నది. త్వరలో ఇది 100 కోట్లకు చేరనున్నది. దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారతదేశం రికార్డు నమోదు చేసుకోనున్నది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 96.88 కోట్ల మంది భారతీయ ఓటర్లు నమోదయ్యారు. ఆ సంఖ్య ఈ ఏడాదికి భారీగా పెరగడం విశేషం.
indian voters:భారతదేశంలో ఉన్న మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 ఏండ్ల వయసున్న యువత ఉన్నారు. 2024తో పోలిస్తే 2025లో స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తిలో తేడా కూడా తగ్గిపోయింది. 2024లో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలు ఉండగా, 2025 నాటికి మహిళా ఓటర్ల సంఖ్య 954కు పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లకు చేరుకున్నది. అంటే సరాసరి సగానికి సమీపంలో ఉన్నారన్న మాట.