Women's Asian Champions Trophy 2024

Women’s Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ

Women’s Asian Champions Trophy 2024: మహిళల ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది.. సొంతగడ్డపై అద్భుత ప్రదర్శనతో సాగుతున్న మన అమ్మాయిలు వరుసగా మూడో విజయంతో దాదాపుగా సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకున్నారు. గోల్స్‌ వర్షం కురిసిన మ్యాచ్‌లో భారత్‌ 13-0 తేడాతో పసికూన థాయ్‌లాండ్‌ను చిత్తుచేసింది. 3,19,43,45 వ నిమిషాల్లో యువ స్ట్రైకర్‌ దీపిక ఏకంగా అయిదు గోల్స్‌తో అదరగొట్టింది.9,40 వ నిమిషాల్లో ప్రీతి దూబె, 12,56వ నిమిషాల్లో లాలెరెమ్సియామి, 55,58వ నిమిషాల్లో మనీష గోల్స్ వర్షం కురిపించారు. 30 నిమిషంలో బ్యూటీ, 53వ నిమిషంలో నవ్‌నీత్‌ కౌర్‌ చేయడంతో థాయ్‌లాండ్‌ పై భారీ విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో లభించిన 12 పెనాల్టీ కార్నర్లలో భారత అమ్మాయిలు అయిదింటిని గోల్స్‌గా మలచడం విశేషం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. చైనా కూడా 9 పాయింట్లే గెలిచినప్పటికీ మెరుగైన గోల్స్‌ అంతరం+21కారణంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: హైదరాబాద్ లో భారీ పేలుడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *