IND vs PAK: ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ టికెట్ల అమ్మకం బుధవారం (జనవరి 14, 2026) ప్రారంభమైంది. టికెట్లు అందుబాటులోకి వచ్చిన నిమిషాల్లోనే బుకింగ్ సైట్ క్రాష్ అవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనున్న ఈ మహా సమరం కోసం ఐసీసీ రెండో విడత టికెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. టికెట్ల కోసం లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా బుక్ మై షో వెబ్‌సైట్. యాప్‌పై విరుచుకుపడ్డారు. దీంతో ఓవర్‌లోడ్ కారణంగా సర్వర్లు నిమిషాల వ్యవధిలోనే నిలిచిపోయాయి. చాలా మంది వినియోగదారులకు ‘టెక్నికల్ ఎర్రర్’ అని రావడం లేదా ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. టికెట్ల ప్రారంభ ధర భారత్‌లో రూ. 100 కాగా, శ్రీలంకలో 1000 ఎల్‌కేఆర్ (LKR)గా ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో అత్యధిక క్రేజ్ ఉన్న మ్యాచ్ ఇదే కావడంతో ఈ స్థాయిలో రద్దీ నెలకొంది.
