india vs pakistan: భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నది. పాకిస్తాన్‌పై ఒక్కొక్కటిగా ఆంక్షలను విధిస్తూ కట్టడి చేస్తున్నది. ఇప్పటికే సింధూ నది జలాలను నిలిపివేసి నీటి కటకట స్పృష్టించింది. సముద్ర, గగనతలాల్లో పాకిస్తాన్‌పై నిషేధం విధించింది. యాప్‌లు, పార్సిళ్లు, పోస్టల్ సర్వీసులను నిలిపివేసింది.
india vs pakistan: ఈ దశలో భారత్, పాక్ పరస్పర యుద్ధం సంభవిస్తే మన దేశంలో దాడులు జరిగే ప్రాంతాలను కేంద్ర హోంశాఖ గుర్తించింది. వాటిని మూడు క్యాటగిరీలుగా గుర్తించినట్టు సమాచారం. క్యాటగిరీ-1లో దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, అణు విద్యుత్ కేంద్రం ఉన్న తారాపూర్‌ను విభజించింది.
india vs pakistan: ఆ తర్వాత క్యాటగిరీ-2లో హైదరాబాద్, విశాఖ నగరాలను గుర్తించినట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా 259 జిల్లాలను క్యాటగిరీ-3 కింద గుర్తించినట్టు సమాచారం. ఈ మూడు క్యాటగిరీలుగా విభజించిన ప్రాంతాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు అంచనా వేసినట్టు సమాచారం.
india vs pakistan: ఇదిలా ఉండగా, తాజాగా ఓ సమాచారం ఉత్కంఠకు దారి తీస్తున్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో కీలకంగా చర్చించినట్టు తెలిసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 259 జిల్లాల్లో పౌరరక్షణ సన్నాహాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌరరక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.