IND vs ENG

IND vs ENG: ఇంగ్లాండ్ తో రేపే మొదటి టీ20… కీలక ప్లేయర్లు వీరే..!

IND vs ENG: ఎర్ర బంతి, డిఫెన్స్, ఐదు రోజుల ఆట ఇక ముగిసింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఫోర్లు, సిక్సర్ల వేటకు రంగం సిద్ధమైంది. ఈ కాలం క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రీతిపాత్రమైన టి20 క్రికెట్ మొదలుకానుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ రేపు మొదలుకానుంది. 

వరుసగా రెండు సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్ లు ఆడిన భారత జట్టు ఇప్పుడు పొట్టి సిరీస్ కు రెడీగా ఉంది. ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల ట్వంటీ- ట్వంటీ సిరీస్ రేపు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే మొదటి మ్యాచ్ తో ప్రారంభం కానుంది. భారత్ గత సంవత్సరం జరిగిన టి20 వరల్డ్ కప్ లో విజయం సాధించిన తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు యువ రక్తంతో జట్టు ఉరకలేస్తున్న భారత జట్టుకు అనూహ్య రీతిలో హార్దిక్ పాండ్యా కాకుండా సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కు అక్షర్ పటేల్ ను టీ20 వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. 

ఇక జట్టులోని ప్రధాన ప్లేయర్ల విషయానికి వస్తే ఎప్పటిలాగే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విన్యాసాలతో పాటు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు సాంసంగ్ మళ్లీ తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వారితోపాటు తిలక్ వర్మ, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్ కూడా సత్తా చాటి జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. వీరితో పాటుగా కొత్తగా జట్టులోకి అడుగుపెట్టిన హర్షిత్ రానా ప్రదర్శన పై కూడా ఆసక్తి నెలకొంది. ఎంతో ఆశ్చర్యకరంగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకొచ్చారు. అయితే ఇది వచ్చే నెలలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ గా మాత్రమే భావించవచ్చు. వన్డే జట్టులో చోటు కూలిపోయిన సిరాజ్ ఇక్కడ కూడా స్థానాన్ని పొందలేకపోయాడు. 

ఇది కూడా చదవండి: Mohammed Siraj: చాంపియన్స్ ట్రోఫీ నుండి సిరాజ్ వేటు సరైనదేనా? వెల్లువెత్తుతున్న విమర్శలు..!

మరి ఇంగ్లాండ్ విషయానికి వస్తే… భీకర బ్యాటింగ్ లైనప్ తో  టీమిండియా కు సవాల్ విసిరేందుకు రెడీగా ఉంది. జాస్ బట్లర్ కెప్టెన్సీలో వారు సత్తా చాట్ ఎందుకు చూస్తున్నారు. ఈ జట్టులోని ఎంతోమంది మరొక రెండు నెలల్లో ఐపీఎల్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో వీరికి ఈ భారత సిరీస్ కీలకం కానుంది. హ్యారీ బ్రూక్, జాకబ్ బెతెల్, జైమీ స్మిత్, గస్ అట్కిన్సన్ భారతీయ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారు అన్న విషయం పైన ఆసక్తిగా నెలకొంది. ఇక సీనియర్ పేసర్ జోఫ్రా ఆర్చర్ భారత బ్యాటర్లకు కఠినమైన సవాళ్ళు విసరగలడు. అతని నేతృత్వంలోని పేస్ అటాక్ ఇండియన్ చిచ్చరపిడుగులను ఇబ్బంది పెడితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ లు జియో సినిమా ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

ALSO READ  Lemon Water: లెమన్ వాటర్ ఎక్కువగా తాగితే వెంటనే ఆపేయండి..!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *