India-China: తూర్పు లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దులో భారత సైన్యం మొదటి రౌండ్ పెట్రోలింగ్ పూర్తయింది. నవంబర్ 1న డెమ్‌చోక్, దేప్సాంగ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ప్రారంభమైంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, రెండు ప్రాంతాలను ఒకసారి భారత సైనికులు, ఒకసారి చైనా సైనికులు గస్తీ నిర్వహిస్తారు. పెట్రోలింగ్ కోసం పరిమిత సంఖ్యలో సైనికులను నియమించారు. ఈ నంబర్ ఎంత అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
వాస్తవానికి తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదంపై నాలుగేళ్లుగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రెండు సంవత్సరాల చర్చల తరువాత, వివాదాస్పద ప్రాంతాలైన డెప్సాంగ్.. డెమ్‌చోక్ నుండి రెండు సైన్యాలు వైదొలగాలని అక్టోబర్ 21న ఒక ఒప్పందం కుదిరింది.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్ చెక్ చేసిన ఎలక్షన్ ఆఫీసర్స్
India-China: LAC పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్.. చైనాల మధ్య ఒప్పందంపై విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ అక్టోబర్ 27 న సైన్యాన్ని ఉపసంహరించుకోవడం మొదటి దశ అని అన్నారు. తరువాత దశ అక్కడ ఒత్తిడిని తగ్గించడం. చైనా కూడా అదే కోరుకుంటోందని భారత్‌కు నమ్మకం కలిగినప్పుడే ఈ ఉద్రిక్తత తగ్గుతుంది. ఉద్రిక్తత తగ్గిన తర్వాత సరిహద్దును ఎలా నిర్వహించాలనే దానిపై చర్చిస్తారు.