VZM

VZM: జాతరలో ఓ లేడీ ఎస్‌ఐపై పోకిరీలు దాడి..

VZM: ఆడది అయితే చాలు.. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు.. ఎస్ఐ అయినా ఇంకెవరు అయినా.. జరుగుతున్నది దేవుడి జాతర.. వీళ్ళు మాత్రం అమ్మాయిల జాతర అనుకున్నారేమో.. వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు.. ఎస్ఐ వచ్చి అడిగితే ఆమె మీద గుంపులు గుంపులుగా దాడి.. కట్ చేస్తే జైల్లో ఉన్నారు…

విజయనగరం జిల్లా గుడివాడలో జరుగుతున్న జాతరలో ఓ లేడీ ఎస్సైపై పోకిరీలు దాడి చేశారు. ఆమెను ఇష్టం వచ్చినట్టుతిట్టమే కాకుండా దాడి కూడా చేశారు. యువతులను ఇబ్బంది పెడుతుంటే వారించినందుకు పోకిరీలు రెచ్చిపోయారు.

వేపాడ మండలంలోని గుడివాడ గ్రామంలో వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్ పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం జరుగుతుంటే కొందరు పోకిరీలు వెకిలిచేష్టలు చేశారు. కార్యక్రమానికి వచ్చిన యువతులు, సందర్శకులతో అసభ్యంగా ప్రవర్తించారు. పోకిరీల చేష్టలు గమనించిన అక్కడే ఉన్న వల్లంపూడి ఎస్సై బి.దేవి వార్నింగ్ ఇచ్చారు. పద్దతి కాదని చెప్పారు. కానీ వారు వినిపించుకోలేదు. దీంతో వారిపై ఎస్సై చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో కుర్రాళ్లు మరింతగా రెచ్చిపోయారు.

Also Read: Mutton Murder: దారుణం.. మటన్ కూర వండలేదని భార్యను చంపిన భర్త

VZM: అసలు అక్కడ గొడవ జరగలేదని… ఎందుకు ఎస్సై చేయి చేసుకున్నారని ప్రశ్నించారు. తను కొట్టడం ఏంటని నిలదీశారు. అసలు తాగి వచ్చి రభస చేయడం ఏంటని తిరిగి ప్రశ్నించారు. పద్ధతిగా లేదని ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. మందలు మందలుగా వచ్చి ఎస్సైను దుర్భాషలాడారు. ఆమెను కొట్టేందుకు పైపైకి వచ్చారు. పక్కనే ఉన్న వాళ్లు వారిస్తున్నా వినిపించుకోలేదు. ఆమెను జుట్టుపట్టి లాగి దాడికి యత్నించారు. ప్రాణ భయంతో ఆమె సమీపంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు.

యువకుల నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీసిన ఎస్సై స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఫుల్ బెటాలియన్‌తో వచ్చారు. కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సైపై దాడి చేసిన 9 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నాడు. గాయాలు పాలైన ఎస్సై స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Avanti Srinivas: పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *