Hyderabad:హైదరాబాద్ నగరంలోని మాధాపూర్ పరిధిలో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ బైక్ కాలిపోయింది. బ్రిడ్జి పై నుంచి వెళ్తుండగా, ఒక్కసారిగా బైక్‌లో నుంచి మంటలు వచ్చాయి. దానిని గమనించిన వాహనదారులు వెంటనే వాహనాన్ని పక్కన నిలిపాడు. దీంతో మంటలు మరింతగా వ్యాపించి అది పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో వాహనదారులు, స్థానిక అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Hyderabad:అనంతరం బ్రిడ్జిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచింది. వాహనాలు బారులు తీరాయి. కేబుల్ బ్రిడ్జి నుంచి కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను చల్లార్చి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
