Hyderabad: హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో వర్షాలకు సంబంధించి ఏర్పడే ఎలాంటి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాలతో రహదారులపై నీరు నిలిచిన చోట్ల దూరంగా ఉండాలని, ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నంబర్ 040-21111111కి సంప్రదించాలని ఆమె కోరారు. అధికార యంత్రాంగం పూర్తి సిద్ధంగా ఉందని, ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
