Film Chamber: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో థియేటర్ల కొరత, ఎగ్జిబిషన్ సిస్టమ్ ఇంకా చిన్న సినిమాల మనుగడపై సుదీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Film Chamber) లో ఈరోజు సబ్ కమిటీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ భేటీకి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అయిన డి. సురేష్‌బాబు, దిల్‌రాజు లతో పాటు పలువురు చాంబర్ ప్రతినిధులు, ఎగ్జిబిటర్లు హాజరై ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై చేర్చించనున్నారు.
పెద్ద సినిమాల తర్వాతే ‘పర్సంటేజ్ విధానం’:
గతంలో థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య వివాదంగా మారిన వర్చువల్ ప్రింట్ ఫీజు (VPF) మరియు పర్సంటేజ్ (వాటా) విధానంపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.
సురేష్ బాబు గతంలో జరిగిన సమావేశంలో పెద్ది సినిమా రిలీజ్ తర్వాత పర్సంటేజ్ విధానంపై చేర్చలు జరుపుదాం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇపుడు పెద్ది సినిమా రిలీజ్ కావడం బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా జరిగిపోయింది
చిన్న సినిమాలకు ‘ఐదో షో’ (5th Show) సంజీవని:
ఈ సమావేశంలో చిన్న, మధ్య తరహా చిత్రాల నిర్మాతలు తమ ఇబ్బందులను కమిటీ ముందు ఉంచారు. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం గగనంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
థియేటర్ల కొరత సమస్యను అధిగమించడానికి చిన్న సినిమాలకు ప్రత్యేకంగా ‘ఐదో షో’ (ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లో) ప్రదర్శించుకునేలా ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు వచ్చేలా చాంబర్ చొరవ చూపాలని నిర్మాతలు కోరారు.
మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో కనీసం ఒక షో అయినా చిన్న సినిమాలకు కేటాయించేలా నిబంధనలు తీసుకురావాలని, తద్వారా కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిలబడే అవకాశం ఉంటుందని నిర్మాతలు సబ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
టాలీవుడ్లో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం, ఓటీటీల ప్రభావం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సబ్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సురేష్‌బాబు, దిల్‌రాజు లాంటి ఇండస్ట్రీ పెద్దలు ఎగ్జిబిటర్లతో మాట్లాడి చిన్న సినిమాలకు ఊరటనిచ్చేలా ‘ఐదో షో’ ప్రతిపాదనను మరియు థియేటర్ల షేరింగ్ సిస్టమ్‌ను ఎంతవరకు క్రమబద్ధీకరిస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి.
