Hyderabad: తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది మొత్తం 171 ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ మంజూరైంది. కన్వీనర్ కోటాలో మొత్తం 76,795 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వ యూనివర్సిటీలు మరియు వాటి అనుబంధ ప్రభుత్వ కాలేజీల సంఖ్య 21గా ఉండగా, వీటిలో 5,808 సీట్లు భర్తీకి ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో రెండు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కలిపి 1,800 సీట్లు ఉన్నాయి.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ఈ ఏడాది 148గా నమోదైంది. వీటిలో మొత్తం 69,727 సీట్లు ఉన్నాయి. గతేడాది తో పోలిస్తే ప్రైవేట్ కాలేజీల సంఖ్య మరియు అందుబాటులో ఉన్న సీట్లు కొంత తగ్గినట్టు అధికారులు తెలిపారు.
విద్యార్థులు తమ ఇంటర్మీడియెట్ ఫలితాల ఆధారంగా, వీటిలో తాము చదవాలనుకునే కాలేజీలను వెబ్ ఆప్షన్స్ ద్వారా ఎంచుకోవచ్చు. అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నది ఏంటంటే – కాలేజీల ర్యాంకింగ్, సౌకర్యాలు, ఫ్యాకల్టీ స్థాయి, గత సంవత్సరాల ప్లేస్‌మెంట్ రికార్డులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆప్షన్లు నమోదు చేయాలన్నారు.