HYDERABAD: హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి తమ నైపుణ్యంతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజా ఘటనలో అమీర్‌పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడిని టార్గెట్ చేసి ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో నమ్మబలికి రూ. 53 లక్షలు కాజేశారు.
గత నెల 18న బాధితుడికి ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి తాను ఢిల్లీ డీసీపీ రాజీవ్ కుమార్‌ని అంటూ పరిచయం చేసుకున్నాడు. బాధితుడిపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, అరెస్టు వారెంట్ జారీ అయిందని భయపెట్టాడు. తన మాటలకు నమ్మకం కలిగించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల నకిలీ కాపీని వీడియో కాల్ ద్వారా చూపించాడు.
ఈ మాటలు విని తీవ్ర ఆందోళనకు గురైన వృద్ధుడు తన ఖాతాలోని డబ్బును వారి చెప్పిన బ్యాంకు ఖాతాలకు విడతలుగా బదిలీ చేశాడు. మొత్తం రూ.53 లక్షలు ఇలా గల్లంతయ్యాయి. డబ్బులు అందుకున్న తర్వాత నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు.
ఇంకా వారితో సంప్రదించలేని పరిస్థితి ఏర్పడటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు