Raj Thackeray

Raj Thackeray: ఒకే వేదికపై ఇద్దరు ఠాక్రేలు… మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుందా?

Raj Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో జూలై 5, 2025 ఎంతో ప్రత్యేకమైన రోజు. గత 20 ఏళ్లుగా రాజకీయ శత్రువులుగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మొదటిసారి ఒకే వేదికపై కనిపించారు! మరాఠీ భాషను ప్రాథమిక విద్యగా తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడంపై ముంబై వర్లిలోని డోమ్ ఆడిటోరియంలో భారీ సభ జరిగింది. అక్కడ 30 వేల మంది ప్రజలు హాజరయ్యారు.

ఈ సభలో వాళ్లిద్దరూ ఒకే వేదికపై ఉండటం చర్చనీయాంశమైంది. ఇది కేవలం భాష గురించి మాత్రమే కాదు.. శివసేనలో ఉన్న విభాగాలు మళ్లీ కలవాలని సంకేతమని భావిస్తున్నారు.రాజ్ ఠాక్రే 2006లో శివసేన నుంచి బయటకు వచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) ను స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ దగ్గరవుతుండటంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్సుకత నెలకొంది.

ఇది సాంస్కృతిక వేదికా.. లేక రాజకీయ కలయికా?

ఈ సభ మొదట విద్య సమస్య మీదే జరిగింది. కానీ వేదికపై ఇద్దరూ మాట్లాడిన మాటలు, చూపిన ఐక్యత మాత్రం పూర్తిగా రాజకీయమే అని నిపుణుల అభిప్రాయం.ఇదంతా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న యోచనకే సంకేతం అన్నది స్పష్టమవుతోంది.

ఠాక్రే బ్రదర్స్ కలిసిపోతారా?

గత రెండు దశాబ్దాలుగా ఉద్ధవ్, రాజ్ పథాలు వేరే వేరే.ఉద్ధవ్ కాంగ్రెస్, ఎన్‌సిపితో కలిసి ‘మహా వికాస్ అఘాడి’లో ముందుకెళ్లారు.అదే రాజ్ ఠాక్రే మాత్రం బీజేపీ, మోదీకి మద్దతు ఇస్తూ హిందూత్వ, మరాఠీ గుర్తింపు రాజకీయం చేశారు.
కానీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఇప్పుడు “ప్రత్యర్థులతో పోరాడాలంటే, సొంతవాళ్లతో రాజీ కావాల్సిందే” అనే రాజకీయ సరళి తీసుకుంటున్నారు.

ఒకే పార్టీనా? లేక కూటమినా?

రెండు అవకాశాలు ఉన్నాయి:

  1. ఒకే పార్టీగా విలీనం – ‘ఒక్క ఠాక్రే.. ఒక్క శివసేన’ నినాదంతో.

  2. కూటమిగా పోటీ – MNS, ఉద్ధవ్ శివసేన కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ.

అయితే నాయకత్వంలో ఎవరు ముందుండాలి అనే అంశం మాత్రం పెద్ద సవాలే! ఇద్దరూ ఠాక్రే కుటుంబానికి చెందినవారు కాబట్టి గొడవలు తలెత్తే అవకాశం ఉంది.

మహా వికాస్ అఘాడి పరిస్థితి ఏమిటి?

MNS కూటమిలో చేరితే, కాంగ్రెస్, ఎన్‌సిపిలకు పెద్ద సమస్యే. MNS కు ఉన్న ముస్లిం వ్యతిరేక ఇమేజ్, గతంలో చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ఇప్పుడు మహా వికాస్ అఘాడిలో చర్చనీయాంశం అవుతాయి.

సీట్ల పంపకమే కీలకం

మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకం, ముఖ్యంగా ముంబై, థానే, నాసిక్, పూణేలో. ఇక్కడ MNS, శివసేన రెండూ బలంగా ఉన్నాయి.నాలుగు పార్టీలు కలిస్తే సీట్ల పంపకం ఎంత క్లిష్టమో ఊహించవచ్చు.

ALSO READ  Adani Probe: అమెరికాలో అదానీపై కేసు . . అసలేం జరిగింది ? అరెస్ట్ తప్పదా ?

ఇది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ దిశగా అడుగా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది బీజేపీకి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటే! ఠాక్రే బ్రదర్స్ కలయిక ద్వారా బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేనకు మహారాష్ట్రలో ఓ కొత్త పోటీ ఉత్పత్తి కావచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *