Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తన వ్యక్తిగత పీఏ జగదీశ్ వ్యవహారంపై తాజాగా స్పందించారు. విశాఖపట్నంలోని సెంట్రల్ జైలు సిబ్బంది వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై పరిశీలించేందుకు ఆమె ఆదివారం జైలుకు వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలోనే పీఏ వ్యవహారంపై ఆమె స్పందించారు.
Home Minister Anitha: తన పీఏ జగదీశ్ వ్యవహారాలు తెలిసి తాను అప్రమత్తమయ్యానని హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో తాను రెండుసార్లు పీఏ జగదీశ్‌ను మందలించానని చెప్పారు. పదేపదే ఆరోపణలు రావడంతో 10 రోజుల క్రితమే అతన్ని తొలగించానని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరిగితే తాను ఊరుకోనని తేల్చిచెప్పారు. ఈ విషయంలో తన పిల్లల జోక్యాన్ని కూడా సహిచబోనని మంత్రి అనిత స్పష్టం చేశారు.