Virat Kohli: ఇండియన్ లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసిన రైల్వేస్ బౌలర్ హిమాన్షు సంగ్వాన్ ఒక్క సారిగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. కోహ్లీని అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన సంగ్వాన్ పైన ఊహించినట్లే విరాట్ ఫాన్స్ శివాలెత్తారు. సోషల్ మీడియా ఆయుధంగా అతన్ని తిట్టిపోశారు. ఇక దీనిపై హిమాన్షు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు…!
రైల్వే రంజి బౌలర్ హిమాన్షు సంగ్వాన్ రాత్రికి రాత్రి ఒక ఫేమస్ క్రికెట్ పర్సనాలిటీ అయిపోయాడు. విరాట్ కోహ్లీని కేవలం 6 పరుగులకే అవుట్ చేసిన హిమాన్షు సంగ్వాన్ వేసిన ఇన్ స్వింగర్ ను ఎంతోమంది కొనియాడారు. అయితే అంతకంటే ఎక్కువ మందే అతనిపై దూషణలకు దిగారు. విరాట్ కోహ్లీకి ఉండే కొంతమంది అత్యుత్సాహ ఫాన్స్… హిమాన్షు సంగ్వాన్ ను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి అతనిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. వారిలో కొంతమంది కోహ్లీ ఫ్యాన్స్ ఉండగా మరి కొంతమంది ఆకతాయి జనాలు ఉన్నారు.
ఇక ఈ విషయంపై హిమాన్షు ని ప్రశ్నించినప్పుడు… అతనిని ఫ్యాన్స్ తిట్టినప్పటికీ… విరాట్ కోహ్లీ మాత్రం తనను మెచ్చుకున్నట్లు తెలిపాడు. సంగ్వాన్ తాను కోహ్లీని అవుట్ చేసిన బంతిపై అతని ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు దగ్గరికి వెళ్ళగా కోహ్లీ ఈ బంతితోనే తనని అవుట్ చేసింది అని సంగ్వాన్ ను అడిగాడట. ఇక ఆ బంతిపై తన ఆటోగ్రాఫ్ పెడుతూ చాలా అద్భుతమైన బంతి వేశావు… నువ్వు మరింతగా కష్టపడు అంటూ భుజం తట్టినట్లు హిమాన్షు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Ind vs Eng T20 Series: టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ చిత్తు! కాదు.. కాదు.. అభిషేక్ ఇంగ్లాండ్ ను ఓడించాడు!!
విరాట్ కోహ్లీ తన క్రికెట్ జీవితంలో తనకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్లేయర్ అని… జీవితం మొదటిసారి తన లైఫ్ లో ఒక రంజీ మ్యాచ్ స్టేడియం ఫుల్ కావడం తను చూసానని హిమాన్షు తెలిపాడు. ఇక ఈ కుర్రాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే… ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు రోజే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ప్రైవేట్ లో మార్చి బరిలోకి దిగాడు హిమాన్షు సంగ్వాన్. అంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ కోహ్లీ వికెట్టు తీయాలి అనే సంకల్పంతోనే అతను గ్రౌండ్ లోనికి వచ్చి దానిని సాధించడం నిజంగా గొప్ప విషయం.
ఇకపోతే మొదటి ఇన్నింగ్స్ లో ఈ రకంగా అవుట్ అయిన కోహ్లీ కి రెండవ ఇన్నింగ్స్ లో ఆడే అవకాశం రాలేదు. ఇక ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లాండ్ తో ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్ కోసం కటోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ కు సంబంధించిన మొదటి వన్డే గురువారం నాగ్ పూర్ లో మొదలుకానుంది.
Beta feature
Beta feature