Political Marriage: రాజకీయాల్లో పదవుల కోసం వ్యూహాలు రచించడం, పైరవీలు చేయడం కామనే. కానీ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ఏకంగా మున్సిపల్ ఛైర్మన్ సీటు దక్కించుకోవడం కోసం ఓ యువ నేత వేసిన ‘పొలిటికల్ మ్యారేజ్’ స్కెచ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. రిజర్వేషన్ ట్విస్ట్‌తో తన 8 ఏళ్ల లవ్‌స్టోరీని అర్జెంట్‌గా పెళ్లిగా మార్చేసినప్పటికీ.. కూటమి పొత్తుల లెక్కలు ఆయన ఆశలపై దారుణంగా నీళ్లు చల్లాయి.పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మున్సిపాలిటీ వేదికగా జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా నెటిజన్లను, లోకల్ కేడర్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
కథేంటంటే? – కౌన్సిలర్ నుంచి ఛైర్మన్ పీఠంపై కన్ను..
సాలూరు మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఈసారి మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు (Direct Elections) జరగనున్నాయి. ఇక్కడికి చెందిన టీడీపీ యువ నేత వైకుంఠపు హర్షవర్ధన్‌కు స్థానికంగా మంచి పట్టుంది.
గతంలో 2019లో ఆయన టీడీపీ కౌన్సిలర్‌గా గెలిచారు. ఆయన తండ్రి వైకుంఠపు పంచముఖి కూడా గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. స్థానిక మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అత్యంత విధేయుడిగా పేరుండటం, బలమైన సామాజిక వర్గం మద్దతు ఉండటంతో ఈసారి ఎలాగైనా సాలూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠం తనకే దక్కుతుందని హర్షవర్ధన్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
రిజర్వేషన్ షాక్ – అర్జెంట్ మ్యారేజ్ ప్లాన్..
అంతా సెట్ అనుకుంటున్న టైమ్‌లో ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ రిజర్వేషన్లు హర్షవర్ధన్‌కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానాన్ని ‘బీసీ మహిళ’ (BC General/Women) కేటాయించారు. దీంతో ఆయన స్వయంగా బరిలోకి దిగే ఛాన్స్ లేకుండా పోయింది.
ఎలాగైనా ఆ పదవిని చేజారకుండా తమ కుటుంబానికే దక్కించుకోవాలని డిసైడ్ అయిన హర్షవర్ధన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.. తాను గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్న గుళ్ల మంజీరాతో ఎలాగూ పెళ్లి ఖాయమైంది. వాస్తవానికి వీరి వివాహం మరో ఆరు నెలల తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరగాల్సి ఉంది.
కానీ నామినేషన్ల గడువు దగ్గర పడటం, రిజర్వేషన్ అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయలేదు. మంచి ముహూర్తాలు చూడలేదు, కనీసం బంధుమిత్రులను కూడా పిలవలేదు. హడావుడిగా ఓ గుడికి వెళ్లి మంజీరా మెడలో తాళి కట్టేశారు. భార్యకు టీడీపీ తరఫున బీ-ఫామ్ ఇప్పించి, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గెలిపించుకుని.. పరోక్షంగా తానే మున్సిపాలిటీని నడపవచ్చని స్కెచ్ వేశారు.
తీరా చూస్తే కూటమి ట్విస్ట్ – సీటు జనసేన ఖాతాలోకి!..
పెళ్లయితే విజయవంతంగా ముగిసింది కానీ, అసలైన పొలిటికల్ క్లైమాక్స్ మాత్రం అమరావతిలో పడింది. గురువారం రాత్రి టీడీపీ-జనసేన-బీజేపీ అగ్రనేతలు కూర్చుని రాష్ట్రవ్యాప్తంగా సీట్ల పంపకాలను లాక్ చేశారు.
ఈ పొత్తుల సర్దుబాటులో భాగంగా.. ఉత్తరాంధ్రలో జనసేనకు కేటాయించిన 3 మున్సిపాలిటీల్లో (రాజాం, పాలకొండ, సాలూరు) ఈ సాలూరు స్థానం జనసేన పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది!
పదవి కోసం, టికెట్ కోసమే ఆరు నెలల ముందే అర్జెంట్‌గా ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టిన యువ నేతకు.. కూటమి డీల్ రూపంలో ఊహించని షాక్ తగిలింది. “పాపం.. ముహూర్తం చూసుకోకుండా, బంధువులను కూడా పిలవకుండా అంత కష్టపడి పెళ్లి చేసుకుంటే.. సీటు వేరే పార్టీకి వెళ్లిపోయిందే!” అంటూ స్థానిక పొలిటికల్ సర్కిల్స్‌లో జోకులు, సెటైర్లు పేలుతున్నాయి.
ప్రేమను, పెళ్లిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసిన యువనేత స్టోరీ.. రాజకీయాల్లో సీట్ల లెక్కలు ఎంత అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉంటాయో మరోసారి రుజువు చేసింది.
