Harish Rao: ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు..

Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు అందించడంలో విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు.

ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు

హరీశ్ రావు వ్యాఖ్యానించిన ప్రకారం, నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు, నెల రోజులుగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందకుండా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు రాకపోవడం వల్ల చిరు ఉద్యోగులు అప్పుల పాలవుతూ, తమ కుటుంబాలను పోషించడంలో కష్టపడుతున్నారని తెలిపారు.

రేవంత్ పాలనపై విమర్శలు

రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన ప్రభుత్వం అమలు చేయని హామీలను అమలైనట్లు చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు.

ప్రభుత్వంపై నిలదీత

ఎంజీఎన్ఆర్ఈజీఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు వంటి వేలాది మంది చిరు ఉద్యోగులు తమ వేతనాల కోసం ప్రభుత్వానికి వినతులు అందజేస్తున్న పరిస్థితి దురదృష్టకరమని హరీశ్ రావు అన్నారు.

పరిపాలనపై దృష్టి పెట్టాలి

కుర్చీని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి ప్రయాణాలు చేయడం, విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెస్తున్నామంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప రేవంత్ ప్రభుత్వం చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలంటూ హరీశ్ రావుసూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *