Viral News: యూట్యూబ్ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే కాకుండా డబ్బు సంపాదించడానికి గొప్ప మార్గంగా కూడా ప్రసిద్ధి పొందింది. యూట్యూబ్‌లో బాగా డబ్బు సంపాదించవచ్చు కాబట్టి తమ ఉద్యోగాలను వదిలి వ్లాగింగ్‌ని కెరీర్‌గా మార్చుకున్న వ్యక్తులు ఉన్నారు. ఈ డిజిటల్ మీడియా వ్యూవర్స్ మరియు సబ్ స్క్రైబర్స్ పొందడానికి యూట్యూబర్‌లు అనేక ఫీడ్స్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక వ్యక్తి తన ఛానెల్‌కు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను పొందడానికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరించాడు తన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసే వారికి ఉచితంగా సమోసాలు ఇస్తామని ప్రకటించాడు.
తెలంగాణలోని హనుమకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన సమోసా బండి యజమాని తన యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్లకు ఉచిత సమోసాల బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
అవును ఆ కుర్రాడు సమోసా సెంటర్ అనే సమోసా బండి నడుపుతున్నాడు, ఆ వ్యక్తి తన స్టాల్‌లో “Janmuounika@volg యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసిన వారికి ఉచిత సమోసాలు ఇస్తాము ” అని బ్యానర్‌ను ఉంచాడు. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను పెంచుకోవడానికి ఆ వ్యక్తి రకరకాల ట్రిక్స్‌ని ఉపయోగించిన ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.