Tollywood

Tollywood: వార్ వన్ సైడ్.. సినీ ఉద్దండులకే సినిమా చూపించిన సీఎం రేవంత్!

Tollywood: ఎదో జరిగిపోతుంది. ఏదేదో అయిపోతుంది అని అంచనాలు. సినీ ఇండస్ట్రీ కోరికల చిట్టాతో ప్రముఖులంతా బయలెల్లారు. ముఖ్యమంత్రిని కలుస్తాం. సినీ ఇండస్ట్రీ మేలు కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం అని సినీ ప్రముఖులు రెండురోజులుగా చెబుతూ వచ్చారు. దానికోసం గ్రౌండ్ కూడా బాగానే ప్రిపేర్ చేశారు. కానీ సినిమా వాళ్లకు ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చేలా ట్విస్ట్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ప్లానింగ్ ముందు.. మాటలతో సినిమా పెద్దలకు గొంతు పెగల్లేదు. మాట్లాడుకోవడానికేమీ లేదు.. నేను చెప్పింది విని.. అలా చేయండి అంతే అనే పంథాలో ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ సాగింది.

సినీ ప్రముఖులతో భేటీకి ముందే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కసరత్తులు చేశారు. ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే విషయాలపై పూర్తి క్లారిటీతో రేవంత్ భేటీలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు ఎవరూ ఏమీ మాట్లాడలేని విధంగా వ్యవహరించారు. భేటీ ప్రారంభంలో సినీ ప్రముఖులు చేసిన సత్కారాన్ని స్వీకరించారు. వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చారు. తరువాత అసలు కథ మొదలెట్టారు. ప్రముఖులందరికీ, పుష్ప2@సంధ్య థియేటర్ సినిమా చూపించారు. అంతే ఇంకా అటుసైడ్ మాటల్లేవ్. ముఖ్యమంత్రి ఏమి చెబుతారా? అనేది వినడం తప్ప. సినిమా చూపించిన తరువాత సున్నితంగా తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వ్య్వవహరించదు అని చెబుతూనే.. ఇకపై ఇష్టారాజ్యం చెల్లదని సంకేతాలు ఇచ్చారు. ఇష్టానుసారంగా రేట్లు పెంచడం.. బెనిఫిట్ షోలు వేసుకోవడం జరగదని చెప్పేశారు. అసెంబ్లీలో తాను ఏమి చెప్పానో దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆ తరువాత సినీ ఇండస్ట్రీ నుంచి ఏమి కోరుకుంటున్నారో నిష్కర్షగా తేల్చేశారు.

Tollywood: సినీ ఇండస్ట్రీతో విబేధాలు లేవనీ.. కలిసి ముందుకు వెళదామని చెప్పిన రేవంత్ రెడ్డి ఒక సబ్ కమిటీ వేసుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఆమేరకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

డ్రగ్స్ అరికట్టే విషయంలో సినీ ఇండస్ట్రీ నుంచి సరైన స్పందనలేదని మొదటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న మాట. దీనినే ప్రముఖంగా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలన కోసం హీరోలు, హీరోయిన్లు కలిసి రావాల్సిందే అని కచ్చితంగా చెప్పేశారు. అంతేకాకుండా సినిమా టికెట్లపై సెస్ విధించాలని.. దానిని ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కి ఇవ్వాలని చెప్పారు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, కులగణన సర్వేలోనూ సినీ ఇండస్ట్రీ తనవంతు సహకారం ఇవ్వాలనీ చెప్పారు.

Tollywood: ఇక సినీ ఇండస్ట్రీ తరఫున ఎవరికీ మాట్లాడటానికి ఏమీ కనిపించలేదు. వార్ వన్ సైడ్ అన్నట్టు భేటీ సాగింది. నాగార్జున హాలీవుడ్ స్థాయి స్టూడియో ఇక్కడ కావాలని చెప్పారు. వరల్డ్ సినీ క్యాపిటల్ గా తయారు కావాలని ఆకాంక్షించారు. అందరూ చిన్న చిన్న విషయాలపై మాట్లాడి మమ అనిపించారు. చివరాఖరుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మీడియా సమావేశం పెట్టి హైదరాబాద్ ను సినీ ఇండస్ట్రీ హబ్ గా చేయడమే ధ్యేయం అని చెప్పారు. ఎఫ్డీసీ తరపున ముఖ్యమంత్రితో చర్చలు జరిపినట్టు వివరించారు. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం ఏమీ లేదని.. అదంతా వట్టి ప్రచారమేనని కొట్టి పడేశారు.

ALSO READ  Pawan kalyan: ముత్యాలమ్మ విగ్రహ ద్వంశంపై పవన్ కళ్యాణ్ స హాట్ కామెంట్స్

మొత్తమ్మీద ప్రచారం జరిగినట్టు అల్లు అర్జున్ ఇష్యు మీద కానీ, అటువంటి వివాదాస్పద విషయాల మీద కానీ ఎటువంటి చర్చ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అక్కడ చర్చ జరగలేదు. కేవలం ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ నుంచి కచ్చితంగా ఏమి కోరుకుంటోంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం మాత్రమే జరిగింది. దీంతో అన్ని సమస్యలకు శుభం కార్డు పడుతుందా.. ఇది సీఎం చూపిస్తున్న సినిమాలో ఇంటర్వెల్ కార్డా అనేది వేచి చూడాల్సిందే.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *