Hyderabad: గంజాయి బ్యాచ్ వీరంగం.. ఎస్ఐ తల పగల కొట్టిండ్రు

Hyderabad: హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. బీర్బాటిల్స్ తో ఎస్సై తల పగలగొట్టారు. గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడులకు తెగబడింది. బీర్బాటిల్స్ తో ఎస్సై తల పగలగొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ ఇన్స్పెక్టర్లు దిలీప్, రాజశేఖర్, సీఐలు దిలీప్, రాజశేఖర్, ఎస్సైలు శివకుమార్, సందీప్, అశోక్, కానిస్టేబుళ్లు మంగళవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు.

పోలీసుల రాకను గుర్తించిన పాత నేరస్థుడు, గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్, అతని తమ్ముడు అరుణ్ పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించి దీపక్ ను పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న టైంలో స్థానికులతో కలిసి అరుణ్ అడ్డుకున్నాడు. అంతా కలిసి పోలీసులపై దాడికి దిగారు. బీర్ బాటిల్ తో కొట్టడంతో ఎస్సై శివకుమార్ తలకు గాయమైంది.

దాడి టైంలో కొందరు ఎస్సై మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు.చివరికి కంబ్లీ దీపక్, అరుణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి వాజ్పేయి కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన విశ్వాసం దవాఖానకు తరలించారు అని తెలిపారు.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *