TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అంతా రంగం సిద్ధమైంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం అదేనెల 9 నుంచి హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని కమిషన్ పేర్కొన్నది. హాల్ టికెట్లను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నది. మొత్తం నాలుగు పరీక్ష పేపర్లకు గాను రోజూ ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
TGPSC: గ్రూప్ 2 ద్వారా 783 ఉద్యోగాల భర్తీకోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ మేరకు నాలుగు పేపర్లకు పరీక్షలు జరుగుతాయి. తొలిరోజైన 15న ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ పేపర్ ఉంటుంది. సాయంత్రం హిస్టరీ, పాలిటీ, సొసైటీ పరీక్ష ఉంటుంది. రెండో రోజైన 16న ఉదయం సెషన్‌లో ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ పేపర్, సాయంత్రం సెషన్‌లో తెలంగాణ మూవ్‌మెంట్, స్టేట్ ఫార్మేషన్ పేపర్ ఉంటుంది.