Amaran

Amaran: ‘అమరాన్’ తో చిక్కుల్లో పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థి!

Amaran: సినిమావాళ్ళు చేసే కొన్ని అనాలోచిత చర్యలు వేరెవరినో ఇబ్బందుల పాలు చేస్తాయి. సరిగ్గా అలాంటి పనే ‘అమరన్’ టీమ్ చేసింది. ఈ సినిమా హీరో శివకార్తికేయన్ ను ప్రేమించిన హీరోయిన్ సాయిపల్లవి తన ఫోన్ నంబర్ ను అతనికి కాగితంపై రాసి ఇస్తుంది. బహుశా రేండమ్ గా దానిని రాసేసి చిత్ర బృందం మూవీలో వాడేసిందే ఏమో… ఇప్పుడు ఆ నంబర్ గల వ్యక్తితో టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఈ సినిమాలో సాయిపల్లవి నంబర్ గా పేర్కొన్న ఫోన్ నంబర్ తనదేనని, ఈ సినిమా విడుదలైనప్పటి నుండి వరుసగా తనకు ఫోన్లు వస్తున్నాయని, సాయిపల్లవితో మాట్లాడాలంటూ ఆమె ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారని సదరు వ్యక్తి వాపోతున్నాడు.

ఇది కూడా చదవండి: Mohini Dey: రెహమాన్ శిష్యురాలూ విడాకులు తీసుకుంది!

తాను ఇంజనీరింగ్ చదువుతున్నానని, చిత్రబృందం చేసిన పని కారణంగా తను ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నానని, నష్టపరిహారంగా తనకు 1.1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసును నిర్మాతలకు పంపాడని తెలుస్తోంది. మరి ఈ విషయంలో మేకర్స్ అతనికి ఎలాంటి ఊరట కలిగిస్తారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన ప్రముఖులు.. ఎవరేమన్నారంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *