Coolie

Coolie: నార్త్‌లో కూలీకి గ్రాండ్ ప్లాన్!

Coolie: తమిళ సినిమా లోకంలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న ‘కూలీ’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. నార్త్ ఇండియాలో ‘కూలీ’ని పెన్ మారుధర్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అయితే, అదే రోజు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్-2’ కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ నెలకొననుంది. నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ కాస్ట్‌తో ‘కూలీ’ అంచనాలను మరింత పెంచింది. రజినీ స్టైల్, లోకేష్ యాక్షన్ కలయికతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *