Meerut Mysterious Deaths

Meerut Mysterious Deaths: అయ్యో.. గొంతుకోసి కుటుంబం మొత్తాన్ని చంపేశారు!

Meerut Mysterious Deaths: మీరట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గొంతు కోసి హత్య చేశారు. ఈ కుటుంబంలోని భార్యాభర్తల మృతదేహాలు ఇంట్లో షీట్‌లో చుట్టి కనిపించాయి. కాగా వారి ముగ్గురు కుమార్తెలను హత్య చేసి గోనె సంచిలో నింపి, ఆపై బెడ్‌బాక్స్‌లో దాచిపెట్టారు. ఇంటి గేటు బయటి నుంచి తాళం వేసి ఉంది. ఉదయం నుంచి బంధువులు, సోదరులు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఇరుగుపొరుగు వారు కూడా ఆ కుటుంబాన్ని ఒక్కరోజు కూడా చూడలేదు.

ఈ మొత్తం వ్యవహారం లిసాడి గేట్ ప్రాంతానికి చెందిన సోహైల్ గార్డెన్‌లో జరిగింది. మరణించిన వారిలో భర్త మోయిన్, భార్య అస్మా,ముగ్గురు కుమార్తెలు – అఫ్సా (8), అజీజా (4), ఆదిబా (1) ఉన్నారు. మొయిన్ మెకానిక్‌గా పనిచేసేవాడు. కాగా, అస్మా అతని మూడవ భార్య. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ప్రజలను, మీడియాను ఇంటి బయటే నిలిపివేశారు. ఏడీజీ డీకే ఠాకూర్, డీఐజీ కళానిధి నైతానీ కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి తెలుసుకున్న. వచ్చారు.

ఒకే గది ఉన్న అద్దె ఇంట్లో మొయిన్ నివసిస్తున్నాడు. ఇంటి గోడలకు ప్లాస్టర్ కూడా వేయలేదు. ఇంటిని 70 చదరపు గజాలలో ఈ ఇంటిని నిర్మించారు. తలుపు బద్దలు కొట్టి హంతకులు లోపలి వచ్చినట్టు తెలుస్తోంది. ఇంటిలో నేలపై బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి. తలుపుకి ఎదురుగా ఒక గది ఉంది, దానికి సమీపంలో ఒక చిన్న వంటగది ఉంది. గదిలో నేలపై, మంచం సమీపంలో, షీట్ల కట్టలో ఉన్న మొయిన్- అతని భార్య మృతదేహాలు ఉన్నాయి. పదునైన ఆయుధాలతో వారి గొంతు కోశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇది కూడా చదవండి: Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సలైట్లు మృతి!

Meerut Mysterious Deaths: గదిలో ఎటువంటి దుర్వాసన లేదు. అటువంటి పరిస్థితిలో, ఈ హత్యలు  జరిగి ఎక్కువ  సమయం గడిచిఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. వస్తువులను ఉంచడానికి మంచంలో పెట్టెలు ఉన్నాయి. అది కూడా ఒకవైపు నుంచి తెరిచి ఉంది. బాలికల మృతదేహాలను బెడ్‌లో దాచారు. ఈ మృతదేహాలు గోనె సంచులలో ఉన్నాయి. పోలీసులు మూడు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు

కుటుంబాన్ని మొత్తం చంపిన వ్యక్తి లేదా వ్యక్తులు బాగా తెలిసిన వారు కావచ్చని భావిస్తున్నారు. కుటుంబం మొత్తానికి వారి ఆహారంలో మత్తు పదార్థాన్ని ఇచ్చారు. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత అందర్నీ హత్య చేశారు. అందుకే ఆ అరుపు ఎవరికీ వినిపించలేదాని అనుకుంటున్నారు. హంతకులు ఇద్దరు లేదా ముగ్గురు ఉంది ఉండవచ్చు. వారు చాలా గంటలు ఇంట్లో ఉన్నారు. అత్యంత కిరాతకంగా హత్యకు పాల్పడ్డరు. 

ALSO READ  Ayyannapatrudu: కవర్ చేయకండి...అచ్చెన్నాయుడు పై స్పీకర్ సీరియస్

ప్రతి ఒక్కరి తలపై గాయం గుర్తులు ఉన్నాయని ఎస్‌ఎస్‌పి విపిన్ తడా తెలిపారు. హంతకులకు ఒకరిపై పగ ఉన్నట్లుంది. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆధారాలు సేకరించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *