Gold Snatcher: పొలంలో గడ్డి కోసుకుని ఇంటికి వస్తున్న ఓ మహిళా రైతుపై దుండగులు దాడి చేసి గొంతు కోశారు. ఆమె మెడలోని మూడు తులాల నాంతాడు, ముక్కుపుడక, చెవికమ్మలు తెంచుకుని పరారయ్యారు. ఈ ఘటన లక్కవరంలో చోటుచేసుకుంది.
Gold Snatcher: చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన మహిళా రైతు ఓబులరెడ్డి నర్సమ్మ వృద్ధాప్యంలోనూ రోజూ పొలం పనులకు వెళ్తోంది. సాయంత్రం ఇంటికి వస్తూ పశువులకు గడ్డికోసుకు వస్తుంది. రోజూ మాదిరి పొలం వెళ్లిన ఆమె గడ్డిమోపుతో ఇంటికొస్తుండగా.. దుండగులు అడ్డగించారు.కత్తితో ఆమె గొంతు కోసి బంగారంతో పారిపోయారు.
ఇది కూడా చదవండి: Donald Trump: జిన్ పింగ్ కు ట్రంప్ ఆహ్వానం.. ప్రధాని మోదీకి ఎందుకు లేదు?
తీవ్ర రక్తస్రావంతో నర్సమ్మ ఘటనా స్థలంలోనే మృతి చెందింది.సమాచారం అందుకున్నఅనకాపల్లి డీఎస్పీ శ్రావణి సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నర్సమ్మ భర్త నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.