Gold rate: ఈ మధ్య కాలంలో బంగారపు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలోని ఆర్థిక మార్పులు, డాలర్ బలవంతం, పలు దేశాలలో ఉన్న ఆర్థిక అస్థిరతలు బంగారం ధరలకు ప్రభావం చూపుతున్నాయి. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచిన తర్వాత, డాలర్ విలువ పెరిగింది. ఈ పరిణామం, బంగారం ధరలను తగ్గించేలా చేసింది. భారతదేశంలో కూడా బంగారం ధర 79 వేల 360 రూపాయల వద్ద ఉండగా, పండుగ సీజన్ సమీపించడంతో, ఈ ధరలు ఆభరణాలు కొనుగోలుకు అనుకూలంగా మారాయి.
అయితే, బంగారం ధరలు ఎంత తగ్గినా, ఇది ఎంతకాలం కొనసాగుతుందో అర్థం కావడం కష్టంగా ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధాలు, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపించవచ్చు.అంతే కాకుండా, ఈ తగ్గింపు దశలో బంగారం పెట్టుబడులకు మంచి అవకాశం అవుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 72 వేల 750 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ. 79 వేల 360 వద్దకు పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల 900 వద్దకు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 79 వేల 510 పలుకుతోంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర l రూ. 72 వేల 750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 79 వేల 575గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ.110 దిగివచ్చి రూ. 79 వేల 575గా ఉంది.