Gold rate: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మార్కెట్ లో బంగారం ధరలు కొద్ది రోజులుగా దిగివస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2626 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఒక ఔన్సుకు 29.92 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు మళ్లీ తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గాయి, రూ. 77, 340 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గాయి రూ. 70, 890 గా పలుకుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70 వేల వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78వేలు పలుకుతోంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70 వేల 250 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 78 వేల 400గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78 వేల 530గా ఉంది.
ఇక వెండి ధరలు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 పెరిగి 98,100 గా నమోదు అయింది.