Gold Price Today: అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వరుసగా నాలుగో రోజు ఈరోజు అంటే 11.01.2025న పెరుగుదల కనిపిస్తోంది. ఆ ప్రభావం మన దేశంలో బంగారం ధరలపై పడింది. ఈరోజు కాస్త ఎక్కువగానే బంగారం ధరలు నమోదు అయ్యాయి. ఇక హైదరాబాద్ లో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు అంటే 11.01.2025న హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగి 72,850రూపాయల వద్ద నిలిచింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 270 రూపాయలు పెరిగి 79,470 రూపాయల వద్దకు చేరుకుంది.
ఇక హైదరాబాద్ లో వెండి విషయానికి వస్తే కేజీ వెండి 1000 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ 1,01,000 వద్దకు వెండి ధర చేరుకుంది.
Gold Price Today: మన తెలుగురాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల విషయానికి వస్తే, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా బంగారం, వెండి ధరలు కాస్త అటూ ఇటూగా ఇలానే ఉన్నాయి.
అదేవిధంగా దేశరాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగాయి. దీంతో బంగారం ధర 73,000 రూపాయలుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 270 రూపాయలు పెరిగి 79,620 రూపాయల వద్ద చేరుకుంది. అలాగే వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ఢిల్లీలో కూడా బరీగా పెరిగింది. 93,400 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Today Horoscope: పాత సమస్యలు పరిష్కారం అయ్యే రోజు.. రాశి ఫలాలు ఇలా ఉన్నాయి
Gold Price Today: అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల పెరుగుదల కంటిన్యూ అవుతోంది. ఈరోజు అంటే 11.01.2025 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర 74,520 రూపాయలుగా ఉంది. అదేవిధంగా వెండి ధరలు వరుసగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి. కేజీ వెండి ధర 84,269 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు అంటే 11.01.2025 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా వచ్చే మార్పులు, స్థానికంగా ఉండే డిమాండ్, స్థానిక పన్నులు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బంగారం, వెండి కొనాలని అనుకునేటప్పుడు మీ ప్రాంతంలో రెండు మూడు దుకాణాల్లో వెరిఫై చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మహాన్యూస్ సూచిస్తోంది.