KTR

KTR: బర్త్‌డే వేడుకలు రద్దు.. నల్ల చొక్కాతో కేటీఆర్ ధర్నా.. ఇందిరాపార్ వద్ద బీఆర్‌ఎస్ భారీ నిరసన!

KTR: ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా బీఆర్‌ఎస్ (BRS) పోరుబాట పట్టింది. బీఆర్‌ఎస్‌వీ (BRSV) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తన 50వ పుట్టినరోజు వేడుకలను సైతం రద్దు చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), నల్ల చొక్కా ధరించి ప్రత్యక్షంగా ఈ ధర్నాలో పాల్గొన్నారు.

1. బర్త్‌డే వేడుకలకు దూరంగా.. విద్యార్థులకు అండగా!

తన 50వ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న కేటీఆర్, విద్యార్థుల హక్కుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇందిరాపార్క్‌ వద్దకు భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత తరలివచ్చారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలను ఎండగట్టడమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశమని బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది.

2. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఢిల్లీలో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థుల ఆవేదన చూస్తే కళ్లలో నీళ్లు తిరిగాయి. విద్యార్థులకు ధైర్యం చెప్పడానికే ఈ ధర్నా చేపట్టాం అని తెలిపారు. ఎవరితో పెట్టుకోకూడదో వారి (యువత)తో ప్రధాని మోదీ పెట్టుకున్నారు. ప్రస్తుత ‘జెన్-జీ’ (Gen-Z) తరానికి కోపం వస్తే నేపాల్, శ్రీలంకలలో ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు. పేపర్ లీకేజీల వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో ధర్నాలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఇప్పుడు స్పందించడం లేదని.. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లి దాక్కున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *