Gold Price Today

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే..

Gold Price Today: గత కొంతకాలంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అడ్డుఅదుపూ లేకుండా పరుగులు పెడుతూ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల పసిడి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అయితే, గత మూడు రోజులుగా ఈ ధరలు కాస్త శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల మార్పుల వల్ల శుక్రవారం ఉదయానికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

మే 29, 2026 ఉదయం సమయానికి అందిన సమాచారం ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి రూ.1,56,050 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,43,040 గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా దిగివచ్చింది. కిలో వెండిపై రూ.100 మేర తగ్గి ప్రస్తుతం రూ.2,74,900 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,050 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,43,040 గాను కొనసాగుతోంది. అయితే ఈ ప్రాంతాల్లో కిలో వెండి ధర మాత్రం రూ.2,84,900 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,200, 22 క్యారెట్ల ధర రూ.1,43,190 గా ఉండగా, అక్కడ వెండి ధర రూ.2,74,900 గా నమోదైంది.

మరోవైపు ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,56,050, 22 క్యారెట్ల ధర రూ.1,43,040 గా ఉంది. చెన్నైలో మాత్రం పసిడి ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,58,170 పలకగా, 22 క్యారెట్ల ధర రూ.1,44,990 గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఉండే పన్నులు, స్థానిక డిమాండ్, రవాణా ఖర్చుల ఆధారంగా ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *