Supreme Court

AP Local Body Elections: సుప్రీంకోర్టులో వైసీపీకి బిగ్ షాక్.. ఏపీ స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నామినేషన్ల దాఖలు గడువును మరికొంత కాలం పొడిగించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు పూర్తిగా తోసిపుచ్చడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం.. ‘ఆల్ ది బెస్ట్.. ఎన్నికలకు వెళ్లండి’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది. అయితే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేలా చూడాలని, పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు సహా ప్రతి కీలక దశనూ సీసీ కెమెరాలతో కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *