Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా మంచి సమయమనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక రోజు తగ్గితే, మరుసటి రోజే అంతకు మించి పెరుగుతూ ఊరిస్తున్నాయి. అయితే, రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు బంగారం, వెండి ధరలు మళ్ళీ దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరగడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.
తగ్గిన బంగారం, వెండి ధరలు
నిన్నటి ధరలతో పోల్చి చూస్తే.. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 320 వరకు తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,39,950 వద్దకు చేరింది. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి గ్రాముపై 10 పైసలు తగ్గి రూ. 274.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ధరలు కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతున్నా, ఈరోజు తగ్గుదల కనిపించడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం.
తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు
మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఒకేలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,52,670
* 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,39,940
* వెండి (కిలో): రూ. 2,74,900
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,52,870గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,40,090 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో బంగారం ధరలు మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1,53,850గా నమోదైంది. ముంబై, బెంగళూరు మరియు కోల్‌కతా వంటి నగరాల్లో హైదరాబాద్ తరహాలోనే ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
