Gautham Menon: వంద కోట్లు పెట్టి భారీ చిత్రాన్ని నిర్మించే కంటే పది కోట్లతో పది చిత్రాలు తెరకెక్కించడం ఉత్తమం అంటున్నాడు తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్. ఈ మధ్య దర్శకుడిగా కంటే నటుడిగా గౌతమ్ మీనన్ కు మంచి గుర్తింపు లభిస్తోంది. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే తమిళ హీరోలు తక్కువ బడ్జెట్ చిత్రాలు చేయడానికి అంగీకరించడం లేదని, భారీ బడ్జెట్ ఉంటేనే సినిమాలు చేస్తామని చెబుతున్నారని గౌతమ్ మీనన్ వాపోయాడు. ఆయన రూపొందించిన మలయాళ చిత్రం ‘డోమినిక్ అండ్ ద లేడీస్ పర్శ్’ మూవీ 23న జనం ముందుకు రాబోతోంది. ఈ కథను తాను తమిళ హీరోలకు చెప్పానని, వారెవరూ ముందుకు రాలేదని, అందుకే మమ్ముట్టీతో మలయాళంలో చేశానని గౌతమ్ మీనన్ అన్నాడు. ఓ రకంగా తెలుగులోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కథను నమ్ముకుని మినిమమ్ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అంగీకరించడంలేదు. అనవసరపు ఆర్భాటాలకు ప్రాధాన్యమిస్తూ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. దాంతో అవి పరాజయం పాలైతే… నిర్మాతలు రోడ్డున పడిపోతున్నారు. మరి గౌతమ్ మీనన్ వ్యాఖ్యలను ఎంతమంది నిర్మాతలు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.
