Gambhir-Shubman: ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. యంగ్ ప్లేయర్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇంకా భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఇంకా అరంగేట్రం చేయలేదు. అంతకుముందే టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ – గిల్ మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఎంపికపై వీరి మధ్య విభేధాలు తలెత్తిన్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో యువ ఆటగాడు సాయి సుదర్శన్ ఉన్నాడు.సాయి సుదర్శన్ ఇప్పటికే తనను తాను అద్భుతమైన బ్యాటర్‌గా నిరూపించుకున్నాడు. అది టీ20 క్రికెట్ అయినా, లాంగ్ టెస్ట్ మ్యాచ్‌లు అయినా. సాయి తన బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే గంభీర్ సాయి సుదర్శన్‌ను భారత జట్టుకు ఎంపిక చేయడంలో ఆసక్తి చూపలేదు. కానీ శుభ్‌మాన్ గిల్ సాయి సుదర్శన్ ఎంపికపై పట్టుబట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: CSK: ఐపీఎల్‌లో CSK చెత్త రికార్డు
ఈ నేపథ్యంలో గిల్, గంభీర్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే సాయి సుదర్శన్ కోసం గిల్ గంభీర్ తో అరగంట పాటు ప్రత్యేకంగా చర్చించి ఒప్పించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్,సెలక్షన్ కమిటీ సాయి సుదర్శన్ వైపు ఎక్కువ మొగ్గు చూపినప్పటికీ.. గంభీర్ తన వైఖరిని మార్చుకునే స్థితిలో లేకపోవడని.. అందుకే కెప్టెన్ కోచ్ తో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.
ఆటగాళ్ల ఎంపికపై గంభీర్ అభిప్రాయభేదాలు తలెత్తాయని వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో, శ్రేయాస్ అయ్యర్‌ను వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చేర్చడం గురించి గంభీర్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. శ్రేయాస్ అయ్యర్ చివరికి జట్టులోకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో శ్రేయాస్ అయ్యర్ కనిపించలేదు. దేశవాళీ క్రికెట్‌లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదనే అంశంపై బీసీసీఐ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.