Ganja

Ganja: సమాధుల మధ్య గంజాయి మొక్కలు.. షాకైన అధికారులు

Ganja: గంజాయికి బానిసైన ఓ యువకుడు ప్రతిసారీ గంజాయిని కొనడం కష్టంగా మారడంతో ఏకంగా తానే సొంతంగా పండించుకోవడం మొదలు పెట్టాడు. ఇంట్లో పెంచితే పోలీసులు, చుట్టుపక్కలవారికి అనుమానం వస్తుందని, ఎవరూ ఊహించని విధంగా స్మశానంలో గంజాయి సాగు మొదలు పెట్టాడు. అది కూడా సమాధుల మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఈక్రమంలో రోజూ వాటికి నీళ్లు తీసుకెళ్లి పోస్తుండటంతో స్థానికులకు అనుమానం రానే వచ్చింది.

Ganja: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామానికి చెందిన బాబ్జి గత కొద్ది నెలలుగా వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. అతను గత కొన్ని నెలలుగా గంజాయికి అలవాటు పడ్డాడు. అయితే ప్రతిసారి గంజాయి కొనుక్కోవడం బాబ్జీకి ఇబ్బందిగా మారిందట. దీంతో ఏకంగా ఆ మొక్కలనే పెంచాలని డిసైడ్ అయ్యాడు. గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో సమాధుల మధ్య మొక్కలని పెంచడం ప్రారంభించాడు.

ఇది కూడా చదవండి: Indian Alliance: కాంగ్రెస్‌కు దూరంగా ఉండండి!ఇండియా కూటమి విచ్ఛిన్నమైందా?

Ganja: మొక్కలను పెంచేందుకు రోజు నీరు తీసుకెళ్లి పోస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్మశానం వద్దకు వెళ్లి చూడగా సమాధుల మధ్య గంజాయి మొక్కలు పెంచడంతో అధికారులకు ఒక్కసారిగా కళ్లు బైర్లుగమ్మాయి. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకొని లక్ష రూపాయల విలువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

Ganja: గంజాయి మొక్కలు ఎక్కడ నుండి వచ్చాయి అని అధికారులు యువకుడిని నిలదీయడంతో తాను కేవలం గంజాయి సేవించే అలవాటు ఉండటంతో మొక్కలను తెచ్చి నాటుకోవడం జరిగిందని.. అంతకుమించి తనకు ఏమీ తెలియదని పోలీసుల ముందు లబోదిబోమన్నాడు. మరో మారు గంజాయి సేవించినా.. గంజాయి లభించినా లక్ష రూపాయల జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  GV Prakash-Saindhavi: విడిపోయిన తర్వాత ఒకే వేదికపై జీవీ ప్రకావ్, సైంధవి!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *