Viral News: పేదవాడికి ప్రాణదానం చేయాల్సిన ప్రభుత్వ పెద్దాసుపత్రిలో మానవత్వం మంటగలిసింది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నిరుపేదలు ఎంతో నమ్మకంతో వచ్చే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి మరోసారి బయటపడింది. గంటల తరబడి బారులు తీరి ఎదురుచూస్తున్న రోగుల పట్ల కొందరు సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురిచేసింది. రోజంతా ఆకలి దప్పులను ఓర్చుకుంటూ, నొప్పులతో విలవిల్లాడుతున్న బాధితులకు వైద్యం అందించాల్సింది పోయి, దురుసు సమాధానాలతో అవమానించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మాకు ఓపిక లేదు.. మీరే వెళ్లిపొండి
గాంధీ ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లు, రక్త పరీక్షల కేంద్రాలు, ఎమర్జెన్సీ విభాగాల్లో సాధారణ రోగుల పట్ల కొందరు సిబ్బంది, నర్సులు, జూనియర్ డాక్టర్లు నిత్యం ఇలాగే అమర్యాదగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు.రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సదరు సిబ్బందిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా ఉన్నతాధికారులు, ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి
4 గంటలుగా ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న రోగులను.. ఓపిక లేదు వెళ్లిపొండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన సిబ్బంది
గాంధీ ఆసుపత్రికి వచ్చే పేద రోగుల పట్ల సిబ్బంది, వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్న… pic.twitter.com/19KoNole0B
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
